Sanjay Kumar Jha : ఐఏఎస్ సంజ‌య్ కుమార్ ఝాపై కేసు

న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశం

Sanjay Kumar Jha : తెలంగాణ కేడ‌ర్ కు చెందిన ఐఏఎస్ సంజ‌య్ కుమార్ ఝాకు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ‌పూర్ కు చెందిన కోర్టు ఆదేశించింది. ఐఏఎస్ భార్య చేసిన ఫిర్యాదు మేర‌కు స్పందించింది. సంజ‌య్ కుమార్ ఝా(Sanjay Kumar Jha) వ‌ర‌క‌ట్న వేధింపులు, అస‌హ‌జ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ బాధితురాలు ఫిర్యాదు చేశారు.

కోర్బా లోని సివిల్ లైన్ పోలీస్ స్టేష‌న్ ఏరియా లోని కొస‌బ‌రిలో నివ‌సిస్తోంది. న‌వంబ‌ర్ 21న , 2021న ద‌ర్బంగా లో బీహార్ లోని ద‌ర్బంగా జిల్లా హేరియా స‌రాజ్ మొహ‌ల్లా బ‌ల‌భ‌ద్రాపూర్ లో సందీప్ కుమార్ ఝాతో వివాహం జ‌రిగింది. పెళ్లికి సంబంధించి రూ. కోటి 70 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.

అయినా అత్త మామ‌లు సంతోషించ లేదు. త‌న‌ను బ‌ల‌వంతంగా అస‌హ‌జ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారంటూ భార్య ఆరోపించింది. వ‌ర‌కట్నం విష‌యంలో గొడ‌వ కూడా జ‌రిగింద‌ని తెలిపింది కోర్టుకు. దీనిపై గ‌తంలో పోలీస్ స్టేష‌న్ లో , ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసినా ప‌ట్టించు కోలేద‌ని వాపోయింది. చివ‌ర‌కు న్యాయ‌వాది శివ నారాయ‌ణ్ ద్వారా కోర్బా కోర్టును ఆశ్ర‌యించింది. త‌క్ష‌ణ‌మే సంజ‌య్ కుమార్ ఝా పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది.

కోర్టులో బాధితురాలి త‌ర‌పున న్యాయ‌వాది స‌మ‌ర్పించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని చీఫ్ జ్యూడీషియ‌ల్ మెజిస్ట్రేట్ కృష్ణ కుమార్ వంశీ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పోలీసుల‌కు స్ప‌ష్టం చేశారు.

Also Read : RK Roja Admitted : రోజాకు అస్వ‌స్థ‌త ఆస్ప‌త్రిలో చేరిక

Leave A Reply

Your Email Id will not be published!