Dheeraj V Deshmukh : డీకేకు ధీరజ్ దేశ్ ముఖ్ కంగ్రాట్స్
లాథూర్ ఎమ్మెల్యే మాజీ సీఎం కొడుకు
Dheeraj V Deshmukh : కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో , కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు డిప్యూటీ సీఎం , కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. అవసాన దశలో ఉన్న పార్టీకి జవసత్వాలు తీసుకు రావడమే కాకుండా గెలుపు దిశగా చేయడంలో సక్సెస్ అయ్యారు. సీఎం రేసులో ఉన్నప్పటికీ పార్టీ హై కమాండ్ డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండేతో పాటు వివిధ రంగాలకు చెందిన డీకే శివకుమార్ ను అభినందలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు , ఏపీ సీఎం జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా మర్యాద పూర్వకంగా డీకే శివకుమార్ ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
సోమవారం మహారాష్ట్ర మాజీ సీఎం, దివంగత విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు, ప్రస్తుత లాథూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధీరజ్ వి దేశ్ ముఖ్(Dheeraj V Deshmukh) డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన డీకే శివకుమార్ ను అభినందించారు. ఆయన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా డీకే శివకుమార్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేను అభినందించారు డీకే శివకుమార్.
Also Read : Pawan Kalyan : ప్రజా క్షేమం కోసం పవన్ యాగం
