Naseeruddin Shah : న‌సీరుద్దీన్ షా కీల‌క కామెంట్స్

ప్ర‌ధాని మోదీపై వ్యంగ్యాస్త్రం

Naseeruddin Shah : జ‌గ‌మెరిగిన న‌టుడు న‌సీరుద్దీన్ షా. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ మ‌ధ్య త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా చెప్పారు. ఆపై కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ పై నోరు పారేసుకున్నారు. చివ‌ర‌కు ట్రోల్ కు కూడా గుర‌య్యారు.

దేశంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు, స‌మ‌స్య‌ల‌పై కూడా స్పందిస్తూ వ‌చ్చారు న‌సీరుద్దీన్ షా(Naseeruddin Shah). తాను ఓ క‌మ్యూనిటీకి చెందిన వాడిగా పేర్కొన‌డం, ప‌రిగ‌ణించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఈ న‌టుడు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మోస్ట్ సీనియ‌ర్ యాక్ట‌ర్ గా త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు న‌సీరుద్దీన్ షా.

తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీపై వేసిన కార్టూన్ ను షేర్ చేశాడు. దానికి క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. షేర్ చేసిన కొద్ది క్ష‌ణాల్లోనే లైక్ లు, కామెంట్స్ ల‌తో నిండి పోయింది. బీజేపీ న‌సీరుద్దీన్ షా పై మండిప‌డింది.

అయితే న‌సీరుద్దీన్ షా భిన్న‌మైన ఆలోచ‌నా ధోర‌ణిని క‌లిగి ఉన్నారు. ప్ర‌జాస్వామ్యంలో క‌ళాకారుల‌కు స్వేచ్ఛ అన్న‌ది ఉంటుంద‌ని, వారు త‌మ అభిప్రాయాల‌ను స్వేచ్ఛ‌గా వెల్ల‌డించే అవ‌కాశం త‌ప్ప‌క ఉండాల‌ని కోరుకుంటారు. మొత్తంగా ఈ కార్టూన్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారుతుంద‌డ‌నంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Yuva Galam : యువ గ‌ళం జ‌న స్వ‌రం

 

Leave A Reply

Your Email Id will not be published!