Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి బెయిల్ కేసు వాయిదా
జూన్ 19కి సుప్రీంకోర్టు వాయిదా
Avinash Reddy Bail : తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి. ఆయనకు సీబీఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తన తల్లికి అనారోగ్యం ఉందంటూ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని రద్దు చేయాలని కోరుతూ దివంగత మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు.
పార్టీ ఇన్ పర్సన్ గా వాదానలు వినిపించారు ఆమె కోర్టులో. తన తండ్రి హత్య వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే ఎంపీ అవినాశ్ రెడ్డికి(YS Avinash Reddy) జారీ చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. ఆయన లోపట ఉంటేనే న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బయటకు రావడం వల్ల సాక్ష్యాలను తారు మారు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ అభిప్రాయపడ్డారు.
జూన్ 30 వరకు దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిందని , ఈ విషయాన్ని తెలిపారు. కాగా ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు సునీతా రెడ్డి. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు అవినాశ్ రెడ్డి.
Also Read : Kothakota Dayakar Reddy : కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత
