MK Stalin PM Modi : నేష‌న‌ల్ ఎగ్జిట్ టెస్ట్ వ‌ద్దే వ‌ద్దు – స్టాలిన్

మోదీ ప్ర‌భుత్వంపై సీఎం తీవ్ర ఆగ్ర‌హం

MK Stalin PM Modi : కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. వైద్య విద్యా విధానంలో కొత్త‌గా నేష‌న‌ల్ ఎగ్జిట్ టెస్ట్ ను తీసుకు వ‌చ్చార‌ని దీని వ‌ల్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు సీఎం. ఇప్ప‌టికే భాష పేరుతో ఆధిప‌త్యాన్ని చెలాయించాల‌ని చూస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. తాము ఎట్టి ప‌రిస్థితుల్లో ఒప్పుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్.

ఇదిలా ఎండ్ ఎన్ఈటీ ప్ర‌వేశ పెట్ట‌డం వ‌ల్ల ఇప్ప‌టికే వైద్య విద్య క‌ఠినంగా మారింద‌ని, దీని వ‌ల్ల అద‌నంగా మ‌రింత భారం ప‌డుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం. కేంద్రం కావాల‌ని రాష్ట్రాల‌ను నిర్వీర్యం చేయాల‌ని చూస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇప్ప‌టికే విప‌రీత‌మైన భారంతో చ‌ద‌వ‌లేక పోతున్నార‌ని పేర్కొన్నారు. వైద్య విద్య అంత సులువైన‌ది ఏమీ కాద‌న్నారు ఎంకే స్టాలిన్(MK Stalin). కోర్సుల‌తో పాటు ఇంట‌ర్న్ షిప్ల‌లో ఇంకా ఇక్క‌ట్లు ఏర్ప‌డుతాయ‌ని తెలిపారు.

ప్ర‌త్యేకించి ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు , విశ్వ విద్యాల‌యాల పాత్ర‌ను మ‌రింత ప‌లుచ‌న చేసేందుకు కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని అందులో భాగంగానే ఈ నేష‌న‌ల్ ఎగ్జిట్ టెస్టు ను తీసుకు రావాల‌ని అనుకుంటోందంటూ మండిప‌డ్డారు.

Also Read : Farmers Protest : హ‌ర్యానా స‌ర్కార్ పై రైత‌న్న‌ల క‌న్నెర్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!