PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశ పారంపర్య పార్టీకి అంత సీన్ లేదన్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించిన ఘనత ఆ పార్టీదేనని అన్నారు. ఇన్నేళ్ల కాలంలో పాలన సాగించిన పాలకులు ఏం చేశారో దేశానికి చెప్పాలన్నారు నరేంద్ర మోదీ.
మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వంశ పారంపర్య పార్టీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు రేట్ కార్డులు ఇష్ట పడతాయని ఎద్దేవా చేశారు. కానీ మా ఏకైక లక్ష్యం ఒక్కటేనని, అది కోట్లాది యువతను కాపాడటం, దేశ భవిష్యత్తును మరింత అర్ధవంతంగా తీర్చిదిద్దడమేనని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
తమకంటూ ఓ విజన్ ఉందని, కానీ గతంలో ఏలిన వారికి ఒక్కటే ఉండేదని అది దోచుకోవడం, దాచుకోవడం అన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చాక పూర్తిగా వ్యవస్థను మార్చేశామని చెప్పారు మోదీ(PM Modi). స్కిల్ ను గుర్తించడం, దానికి సాన పెట్టడం, పనిమంతులుగా తయారు చేయడం ఇదే తన అంతిమ లక్ష్యమన్నారు.
ఇవాళ భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందని స్పష్టం చేశారు. డిజిటలైజేషన్ రంగంలో ప్రస్తుతం భారత్ నెంబర్ వన్ లో ఉందని చెప్పారు మోదీ. టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని దానిని దేశానికి అనుసంధానం చేస్తే మరింతగా ఎదగవచ్చని తాను ఆలోచించానని అదే ప్రస్తుతం అమలవుతోందని చెప్పారు ప్రధానమంత్రి.
Also Read : Bandi Sanjay Kavitha : కవిత కామెంట్స్ పై భగ్గుమన్న బండి
