Eric Garcetti Ajit Doval : అజిత్ దోవ‌ల్ అంత‌ర్జాతీయ సంప‌ద‌

అమెరికా రాయ‌బారి ఎరిక్ గార్సెట్టి

Eric Garcetti Ajit Doval : యుఎస్ఏ రాయ‌బారి ఎరిక్ గార్సెట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశానికి చెందిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న ప‌నితీరు అద్భుత‌మంటూ కొనియాడారు. ధోవ‌ల్ భార‌త్ కు చెందిన వ్య‌క్తి మాత్ర‌మే కాద‌ని ఆయ‌న యావ‌త్ ప్ర‌పంచానికి ద‌క్కిన విలువైన సంప‌ద అని అభివ‌ర్ణించారు ఎరిక్ గార్సెట్టి.

ప్ర‌స్తుతం అమెరియా రాయ‌బారి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేపాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. భార‌త్, అమెరికా దేశాల మ‌ధ్య గ‌త కొన్ని త‌రాల పాటు స‌త్ సంబంధాలు నెల‌కొని ఉన్నాయ‌ని పేర్కొన్నారు. బ‌ల‌మైన పునాది వేయ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించారంటూ దోవ‌ల్ ను ప్ర‌శంసించారు ఎరిక్ గార్సెట్టి(Eric Garcetti).

అమెరికా రాయ‌బారి భార‌త్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా క్రిటిక‌ల్ అండ్ ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీస్ పై జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు ఎరిక్ గార్సెట్టి. ఇదే స‌మ‌యంలో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా వారిద్ద‌రూ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై చ‌ర్చించారు. మ‌రో వైపు ఎరిక్ గార్సెట్టితో పాటు అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జేక్ సుల్లివ‌న్ కూడా స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : Senthil Balaji Arrest : మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్

 

Leave A Reply

Your Email Id will not be published!