Devulapalli Amar : జ‌ర్న‌లిస్టుల సంగ‌తి ప‌ట్టించుకోరా -అమ‌ర్

ఏపీ జాతీయ మీడియా స‌ల‌హాదారు

Devulapalli Amar : ఏపీ జాతీయ మీడియా స‌ల‌హాదారు దేవుల‌ప‌ల్లి అమ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శ్రీ‌నివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ఎందుకు ప‌ట్టించు కోవ‌డం లేదంటూ నిప్పులు చెరిగారు. జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కేటాయించిన భూమిపై త‌క్ష‌ణ‌మే తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

సొసైటీ స‌భ్యుల‌తో పాటు మిగ‌తా జ‌ర్న‌లిస్టుల‌కు కూడా స్థ‌లాలు ఇవ్వాల‌ని కోరారు దేవుల‌ప‌ల్లి అమ‌ర్. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌ర్న‌లిస్టుల‌ను ఆనాడు వేధింపుల‌కు గురి చేసింది అప్పుడే మ‌రిచి పోతే ఎలా అంటూ శ్రీ‌నివాస్ రెడ్డిపై సెటైర్లు వేశారు. ఏపీలో జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఎంత‌గానో కృషి చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. కొంద‌రు చేసిన ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మ‌న్నారు.

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌కు రాజ‌కీయ రంగు పూయాల‌ని చూస్తున్నారంటూ మండిప‌డ్డారు దేవుల‌పల్లి అమ‌ర్(Devulapalli Amar). ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌ట్ల భిన్నమైన అభిప్రాయాల‌ను ఎందుకు వ్య‌క్తం చేస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నారు. త‌మ‌కు అనుకూలంగా లేని మీడియాపై చంద్ర‌బాబు ప‌నిగ‌ట్టుకుని ఇబ్బంది పెట్టార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల ఇంటి స్థ‌లాల‌పై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింద‌ని ఆ విష‌యం మ‌రిచి పోయారా అంటూ నిల‌దీశారు.

Also Read : Pawan Kalyan YS Jagan : జ‌గ‌న్ రెడ్డీ జ‌ర జాగ్ర‌త్త – జ‌న‌సేనాని

Leave A Reply

Your Email Id will not be published!