Chandrababu Naidu : పవర్ లోకి వస్తాం తిన్నదంతా కక్కిస్తాం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ సర్కార్ పీకల్లోతు అవినీతిలో కూరుకు పోయిందన్నారు చంద్రబాబు నాయుడు. దేశంలో సీఎం జగన్ రెడ్డి అంత అవినీతి పరుడు దేశంలో ఎక్కడా లేరని తాను అనలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అన్నారని గుర్తు చేశారు.
జగన్ అవినీతిపై పదే పదే ప్రకటనలు చేస్తున్న కేంద్ర మంత్రులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు టీడీపీ చీఫ్. కుప్పంలో గ్రానైట్ దోపిడీ చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దోచినదంతా కక్కిస్తామని హెచ్చరించారు. 2 వేల రూపాయల నోట్లను వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).
తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులకు అందరికీ న్యాయం చేసేలా పథకాలు రూపొందించామని చెప్పారు. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుందని, తద్వారా పెరిగిన ఆదాయంతో పేదలకు ఆ ఫలాలను అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకాలను కుప్పం నుంచే తాను ప్రారంభిస్తానని అన్నారు.
Also Read : Devulapalli Amar : జర్నలిస్టుల సంగతి పట్టించుకోరా -అమర్
