Manoj Bajpayee : పాలిటిక్స్ లోకి రాను – బాజ్ పేయి

లాలూ ప్రసాద్ యాద‌వ్ తో భేటీ

Manoj Bajpayee : ప్ర‌ముఖ న‌టుడు మ‌నోజ్ బాజ్ పేయి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తన క్యారెక్ట‌ర్ కు పాలిటిక్స్ స‌రిపోవంటూ స్ప‌ష్టం చేశారు. బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో పాటు ఆయ‌న త‌న‌యుడు, బీహార్ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ ను మ‌నోజ్ బాజ్ పేయి క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా చాలా సేపు వీరు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. ఇదిలా ఉండ‌గా బాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడిగా గుర్తింపు పొందారు మ‌నోజ్ బాజ్ పేయి. ఆయ‌న సినిమాల‌లో కంటే వెబ్ సీరీస్ ల‌లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు.

గ‌తంలో బీహార్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు వారిని క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని , అదే స‌మ‌యంలో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని అనుకున్నారని పేర్కొన్నారు. త‌న‌కు నిజంగా పాలిటిక్స్ అంటే ఇష్టం లేద‌న్నాడు. విచిత్రం ఏమిటంటే సినిమాల్లో లేదా వెబ్ సీరీస్, సీరియ‌ల్స్ ల‌లో రాజ‌కీయ పాత్ర‌ల‌లో న‌టించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌య‌మ‌న్నారు మ‌నోజ్ బాజ్ పేయి(Manoj Bajpayee).

ఇదిలా ఉండ‌గా ప‌శ్చిమ చెంపార‌న్ జిల్లా లోని బెల్వా స్వ‌స్థ‌లం న‌టుడిది. ఇటీవ‌ల త‌న విడుద‌లైన సిర్ప్ ఏక్ బందా కాఫీ హై (ఒక్క వ్య‌క్తి చాలు ) కు సంబంధించి ప్ర‌మోష‌న్ కోసం పాట్నాకు వ‌చ్చారు. ఈ చిత్రంలో మ‌నోజ్ న్యాయ‌వాది పాత్ర పోషించారు. ఇదే స‌మ‌యంలో బీహార్ లో కొత్త ఫిల్మ్ పాల‌సీని తీసుకు రావాల‌ని కోరాడు. ఇందుకు స‌హ‌క‌రించాల‌ని కోరాడు న‌టుడు.

Also Read : Brij Bhushan Sharan Singh : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై నివేదిక సిద్దం

 

Leave A Reply

Your Email Id will not be published!