Kodali Nani : ద‌మ్ముంటే చూసుకుందాం దా – నాని

చంద్ర‌బాబు నాయుడికి స‌వాల్

Kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ద‌మ్ముంటే , నీవు గ‌నుక మ‌గోడివే అయితే గుడివాడ‌కు రా చూసుకుందాం అంటూ స‌వాల్ విసిరారు. శుక్ర‌వారం గుడివాడ‌లో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. నిత్యం అబ‌ద్దాలు ఆడుతూ ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే చంద్ర‌బాబు నాయుడుకు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌ని అన్నారు ఈ సంద‌ర్బంగా పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని.

దివంగ‌త సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ రెడ్డి గుడివాడ‌కు చేసిన సేవ‌ల‌ను తాను ఎన్న‌టికీ మ‌రిచి పోలేన‌ని అన్నారు. త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంట ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు కొడాలి నాని. ఒకానొక స‌మ‌యంలో ఆయ‌న తీవ్ర ఆవేశానికి లోన‌య్యారు. ప‌చ్చ బ్యాచ్ ఎంత‌గా దుష్ప్ర‌చారం చేసినా గుడివాడ‌లో ఒక్క వెంట్రుక కూడా పీక‌లేర‌ని స్ప‌ష్టం చేశారు. తానేమిటో త‌న ప‌వ‌ర్ ఏమిటో బెజ‌వాడ ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా ఏకి పారేశారు కొడాలి నాని(Kodali Nani). తాను ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నాడో, ఎందుకోసం పార్టీ పెట్టాడో, తాను ఏం మాట్లాడుతున్నాడో త‌న‌కే తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. ఎన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా ప్ర‌జ‌లు ప‌ట్టించుకునే స్థితిలో లేర‌న్నారు కొడాలి నాని. జ‌గ‌న్ సీటును క‌దిల్చే ద‌మ్ము , ధైర్యం , ఖ‌లేజా చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న‌ను మోస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు లేద‌న్నారు మాజీ మంత్రి.

Also Read : Chandrababu Naidu : ఇంకెంత కాలం జ‌గ‌న‌న్న రాజ్యం

 

Leave A Reply

Your Email Id will not be published!