Delhi Govt School : ఢిల్లీ ప్ర‌భుత్వ స్కూల్ రికార్డ్

నీట్ లో 71.26 శాతం రేటు

Delhi Govt School : సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఆధ్వ‌ర్యంలోని ఆప్ ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. విద్యా రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇచ్చింది. ప్ర‌త్యేకించి ప్ర‌భుత్వ బ‌డులను ఆధునీక‌ర‌ణ చేసింది. అంతే కాకుండా మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించింది. రాష్ట్ర బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా నిధుల‌ను కేటాయించిన ఘ‌న‌త ఆప్ స‌ర్కార్. ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు అద్భుత ఫ‌లితాల‌ను సాధించింది.

తాజాగా నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష‌లో ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు(Delhi Govt School) చెందిన విద్యార్థులు స్పెష‌లైజ్డ్ ఎక్స‌లెన్స్ అత్య‌ధికంగా 71.26 శాతం స‌క్సెస్ రేట్ ను సాధించింది. జీవ శాస్త్రం తీసుకున్న విద్యార్థులు 328 మంది ఉన్నారు. ఇందులో భాగంగా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక‌లారియాట్ (ఐబీ)తో క‌లిసి రూపొందించిన కొత్త అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల సిల‌బ‌స్ అత్యుత్త‌మ ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఇటీవ‌ల నూత‌నంగా నిర్మించిన బ‌డిని ప్రారంభించారు. అంతే కాకుండా అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేసిన గురు గోవింద్ సింగ్ విశ్వ విద్యాల‌యాన్ని కూడా ప్రారంభించారు ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్థులు నీట్ లో అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధించినందుకు ప్ర‌త్యేకంగా అభినందించారు.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం విద్యా రంగాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించింద‌ని ఆరోపించారు సీఎం. తాము ఎక్క‌డా , ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని పేర్కొన్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : Kodali Nani : ద‌మ్ముంటే చూసుకుందాం దా – నాని

 

Leave A Reply

Your Email Id will not be published!