AP BJP Meetings : ఆంధ్రప్ర‌దేశ్ లో బీజేపీ స‌భ‌లు

పాల్గొన‌నున్న కీల‌క నేత‌లు

AP BJP Meetings : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీలో(AP BJP) దూకుడు పెంచింది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ‌, శ్రీ‌కాకుళంలో ప‌ర్య‌టించారు. పార్టీ జాతీయ చీఫ్ జేపీ న‌డ్డా కూడా పాల్గొన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా వ‌రుస‌గా స‌భ‌లు, స‌మావేశాలు, స‌ద‌స్సులు నిర్వ‌హిస్తోంది. ఆదివారం రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ‌లు చేప‌ట్టింది.

న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో దేశంలో కొలువు తీరి 9 ఏళ్ల‌యింది. ఈ సంద‌ర్బంగా సాధించిన విజ‌యాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి మ‌రోసారి తీసుకు పోయేందుకు వీటిని ఉప‌యోగించుకుంటోంది. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు, కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు ఈ స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

ఆదివారం సాయంత్రం ఏలూరులో బీజేపీ స‌భ జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు, మాజీ మంత్రి సృజ‌నా చౌద‌రి పాల్గొంటారు. అన‌కాప‌ల్లిలో జ‌రిగే కాషాయ స‌భ‌లో రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ హాజ‌ర‌వుతారు. విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నున్న స‌భ‌లో ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు పాల్గొంటారు.

గుంటూరు జిల్లా తెనాలిలో జ‌రిగే స‌భ‌లో పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి వై స‌త్య‌కుమార్ హాజ‌ర‌వుతారు. సోమవారం సాయంత్రం ప‌ల్నాడు జిల్లా న‌ర‌సారావుపేట స‌భ‌లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. జూన్ 20న అనంత‌పురంలో జ‌రిగే బీజేపీ స‌భ‌లో మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి హాజ‌ర‌వుతారు.

Also Read : IND vs WI 2023 Schedule : జూలై 12 నుంచి విండీస్ టూర్

 

Leave A Reply

Your Email Id will not be published!