TTD Booklet Release : తిరుమలలో సాలకట్ల వైభవోత్సవాలు
బుక్ లెట్ ను ఆవిష్కరించిన జేఈవో
TTD Booklet Release : తిరుమల శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు సిద్దమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా తండోప తండాలుగా తరలి వస్తున్నారు. ఇక ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్న స్వామి వారి సాలకట్ల ఉత్సవాలు ఈసారి కూడా టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు సంబంధించిన బుక్ లెట్(TTD Booklet) ను తిరుమలలోని పరిపాలనా భవనంలో తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూన్ 22న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహంచనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపడతారు.
జూన్ 24న పెదద్ శేష వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు. జూన్ 2న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. భక్తులను కటాక్షించనున్నారు.
జూన్ 27న పార్వేట ఉత్సవం జరగనుంది. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 నుండి ఈ ఉత్సవం జరగనుంది.
Also Read : AP BJP Meetings : ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ సభలు
