MK Stalin Rahul : సోదరా ప్రజల కోసం కలిసి నడుద్దాం
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్
MK Stalin Rahul : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలిపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆయనతో పాటు దేశంలోని ప్రముఖులు సోమవారం యువ నాయకుడిని అభినందనలతో ముంచెత్తారు. ఈ దేశానికి నీలాంటి నాయకుడు కావాలని కోరారు. ట్విట్టర్ వేదికగా ఎంకే స్టాలిన్(MK Stalin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియమైన సోదరా రాహుల్ జీ మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరారు. మీకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
భారత దేశం ఇవాళ కష్టాల్లో ఉంది. మతం అనే మత్తు మందు కలిగి ఉన్న కాషాయ శ్రేణులు కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మీరు చేపట్టిన భారత్ జోడో యాత్ర అద్భుతమని పేర్కొన్నారు. భారత దేశ ప్రజాస్వామ్య ధర్మాన్ని కాపాడేందుకు మన ముందు సుదీర్ఘ ప్రయాణం ఉందని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం. కలిసి కవాతు చేద్దామని రాహుల్ గాంధీకి సీఎం పిలుపునిచ్చారు.
ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ , డీఎంకేతో కలిసి సంకీర్ణ సర్కార్ లో కొలువు తీరింది. ఇదే క్రమంలో గత కొంత కాలం నుంచీ కలిసి పోరాటం చేస్తున్నారు. కేంద్రంలో మోదీకి వ్యతిరేకంగా, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నారు.
Also Read : Revanth Reddy : రాహుల్ జీ జీతే రహో – రేవంత్