Mallikarjun Kharge : ఇకనైనా మోదీ మేల్కొంటే బెటర్
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శనివారం ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. దేశం పట్ల అవగాహన లేకుండా పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధానికి ప్రచారంపై ఉన్నంత శ్రద్ద ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టడం లేదని ఫైర్ అయ్యారు మల్లికార్జున్ ఖర్గే.
తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని ద్రవ్యోల్బణం ఉందని కానీ బీజేపీ సర్కార్ కుంటి సాకులు చెబుతూ కాలం వెళ్లబుచ్చిందని ధ్వజమెత్తారు ఏఐసీసీ చీఫ్. ద్రవ్యోల్బణం అనేది లేనే లేదంటూ అబద్దాలు చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజలు కూడా నెత్తీ నోరు మొత్తుకున్నా పాకిస్తాన్ , చైనా , యుద్దం , కోవిడ్ , ఆర్థిక మాంద్యం ఇలా సంబంధం లేని వాటితో నోరు మూపించే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge).
తాము చెప్పిన వాస్తవాలనే ప్రభుత్వ అధికారిక ఆర్థిక సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కుండ బద్దలు కొట్టిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం ఉందని, దీని కారణంగా ప్రజాధనం తక్కువ ఖర్చుతో కూడుకుందని దాని వల్ల అమ్మకాలు పెరగడం లేదంటూ వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసిందని తెలిపారు. దీని వల్ల ప్రైవేట్ పెట్టుబడులు తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆర్బీఐ చెబుతుంటే ఇకనైనా మోదీ నమ్మక పోతే ఎలా అని ప్రశ్నించారు ఖర్గే.
Also Read : CM Siddaramaiah : సాహిత్యం సజీవం – సిద్దరామయ్య
