Janasena Party Symbol : జన సేనకు ఏపీ ఈసీ ఊరట
పంచాయతీ ఎన్నికల్లో గ్లాసు గుర్తు
Janasena Party Symbol : జన సేన పార్టీకి ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఆ పార్టీ గుర్తింపు కోల్పోయింది. కాగా పార్టీకి సంబంధించి గ్లాసు గుర్తు ఉండేది. రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టీ గ్లాస్ గుర్తును కేటాయించింది. రిజర్వ్ చేయబడిన ఎన్నికల చిహ్నాలతో నమోదైన పార్టీల జాబితాలో జనసేన పార్టీని రాష్ట్ర ఎన్నికల సంఘం సమర్థించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ(Janasena Party) అధికారికంగా వెల్లడించింది.
గతంలో పవన్ కళ్యాణ్ అన్న, మెగాస్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు పొందారు. భారీ ఎత్తున అభిమానులను కలిగి ఉన్నారు.
ఏపీలో బలమైన పార్టీగా ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆయన జన సేన పార్టీని స్థాపించారు. దాని పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన మేర రాణించ లేక పోయింది పార్టీ. వైసీపీ గతంలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సీట్లను సాధించింది. ఇక తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలకే పరిమితమైంది. త్వరలో ఏపీలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది.
Also Read : Bandi Sanjay : పోయేటోళ్లను ఆపం – బండి
