MP Vijay Sai Reddy : ఏపీలో మ‌ళ్లీ మాదే అధికారం

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

MP Vijay Sai Reddy : వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఏకి పారేశారు. వాళ్ల‌కు విజ‌న్ అనేది లేద‌న్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా వ‌చ్చేది త‌మ పార్టీనేనంటూ జోష్యం చెప్పారు. ఒక‌రేమో ప‌వ‌ర్ పోయి గిల గిల లాడుతున్నార‌ని మ‌రొక‌రేమో ఏం మాట్లాడుతున్నారో తెలియ‌క నోరు జారుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇక ఏపీలో బీజేపీ అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా లేక త‌ల కిందులు చేసినా ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షాల‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఎవ‌రు ఎక్క‌డ నిల‌బ‌డ‌తారో ధైర్యంగా చెప్ప‌లేని స్థితిలో ప్ర‌తిప‌క్షాల నేత‌లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి(MP Vijay Sai Reddy). ఆయ‌న ప్ర‌ధానంగా టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ చీఫ్ సోము వీర్రాజుల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాము ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏం చెప్పామో అదే ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 99 శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశామ‌న్నారు. ఇక మిగిలిన ఒక్క శాతాన్ని కూడా భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డ నుంచి బ‌రిలో ఉంటారో వాళ్ల‌కే తెలియ‌ని స్థితిలో ఉన్న‌ప్పుడు ఇక జ‌నాల గురించి ఏం ఆలోచిస్తారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. రాబోయే ఎన్నిక‌ల్లో 175 సీట్లు ప‌క్కా అని అన్నారు.

Also Read : Janasena Party Symbol : జ‌న సేన‌కు ఏపీ ఈసీ ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!