KTR Puri : హ‌ర్దీప్ సింగ్ ను క‌లిసిన కేటీఆర్

ప‌లు అంశాల‌తో ప్ర‌తిపాద‌న‌లు

KTR Puri : ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా ఉన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. శ‌నివారం దేశ రాజ‌ధానిలో కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీని(Hardeep Singh Puri) క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు అంశాలు ప్ర‌తిపాదించారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండ‌వ ద‌శ విస్త‌ర‌ణ‌కు కేంద్ర స‌ర్కార్ ఆమోదం తెల‌పాల‌ని కోరారు. ల‌క్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ దాకా 26 కిలోమీట‌ర్లు, నాగోల్ నుంచి ఎల్బీ న‌గ‌ర్ వ‌ర‌కు 5 కిలోమీట‌ర్ల మెట్రో కు ఆమోదించాల‌ని , ఇదే క్ర‌మంలో ఆర్థిక సాయం చేయాల‌ని విన్న‌వించారు కేటీఆర్.

జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌కం మాదిరిగానే ప‌ట్ట‌ణ పేద‌ల కోసం ప్ర‌త్యేకంగా హామీ కార్య‌క్ర‌మాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. న‌గ‌రంలో ఇప్ప‌టికే 22 మిస్సింగ్ లింక్ రోడ్ల‌ను పూర్తి చేశామ‌ని ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రికి మంత్రి తెలిపారు. 17 నిర్మాణాలు పూర్తి కావ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు.

104 అద‌న‌పు కారిడార్ల‌ను నిర్మించేందుకు రూ. 2,400 కోట్లు ఖ‌ర్చువుతుంద‌ని తెలిపారు. రూ. 800 కోట్లు స‌ర్కార్ కేటాయించింద‌ని చెప్పారు కేటీఆర్. చెత్త‌, చెదారాన్ని తొలగించేందుకు కేంద్ర స్వ‌చ్చ భార‌త్ మిష‌న్ నుంచి రూ. 400 కోట్లు ఇవ్వాల‌ని కోరారు. త‌మ స‌ర్కార్ చేప‌డుతున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి 15 శాతం నిధులు అందించాల‌ని సూచించారు. ఇంకా ప‌లు ప్ర‌తిపాద‌న‌లు మంత్రి ముందు ఉంచారు కేటీఆర్.

Also Read : RS Praveen Kumar : ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా – ఆర్ఎస్పీ

 

Leave A Reply

Your Email Id will not be published!