Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ ఆదేశించింది. ఈ మేరకు ఆయన హుటా హుటిన హస్తినకు బయలు దేరి వెళ్లారు. గత కొంత కాలంగా పార్టీలో ఏదో జరుగుతోందన్న ప్రచారం కొనసాగుతోంది. ప్రధానంగా పార్టీలో గతంలో చేరిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ,
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్లు ఆదివారమే బయలుదేరి వెళ్లారు. ఇదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీ పెద్దలను, మంత్రులను కూడా బండి సంజయ్(Bandi Sanjay) కలవనున్నట్లు సమాచారం.
ప్రధానంగా ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిల వ్యవహారంపైనే ప్రధానంగా బండితో చర్చించనున్నట్లు టాక్. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈటల, రెడ్డి. వారు అంటీముట్టనట్టుగా ఉన్నారు. మరో వైపు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగానే ఉన్నామని స్పష్టం చేశారు.
కానీ ఆ ఇద్దరు నేతలు బండిపై గుర్రుగా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వారిని కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆ పార్టీ చీఫ్ రవేంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరడం విశేషం. మొత్తంగా బండి పర్యటనలో ఏం జరగబోతోందనేది కొద్ది సేపు ఆగితే తేలుతుంది.
Also Read : Lokesh Kanagaraj : విజయం కోసం ‘లియో’ సిద్దం
