P Chidambaram : యుసీసీపై మోదీ కామెంట్స్ త‌గ‌దు

నిప్పులు చెరిగిన పి. చిదంబ‌రం

P Chidambaram : ఎన్ని అవాంతరాలు ఎదురైనా స‌రే యూనిఫాం సివిల్ కోడ్ (యుసీసీ) అమ‌లు చేసి తీరుతామంటూ స్ప‌ష్టం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై విప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. ఇప్ప‌టికే ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు డీఎంకే చీఫ్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇదే స‌మ‌యంలో బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ పి. చిదంబ‌రం(P Chidambaram) షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ దేశంలో మోదీ కొలువు తీరిన త‌ర్వాత వ‌న‌రుల విధ్వంసం కొన‌సాగుతూనే ఉంది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పారు, ఆర్థిక నేర‌గాళ్ల‌ను ప‌ట్టుకుంటామ‌ని అన్నారు. ఏ ఒక్క దానిని అమ‌లు చేయ‌లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభం దిశ‌గా భార‌త్ ప‌య‌నిస్తోంద‌ని, ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం, మ‌రో వైపు నిరుద్యోగం తీవ్ర ఇబ్బంది క‌లిగిస్తోంది..కానీ ఈ వైఫ‌ల్యాల గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తుండ‌డంతో త‌ట్టుకోలేక పోతున్నార‌ని ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో మ‌ణిపూర్ కాలిపోతుంటే బీజేపీ స‌ర్కార్ ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి దాకా మోదీ ఎందుకు మౌనం వ‌హించారో చెప్పాల‌న్నారు. ఈ వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకే బీజేపీ ప‌రివారం యూసీసీని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు పి. చిదంబ‌రం. ఇది సాధ్య‌ప‌డ‌ద‌ని గ‌తంలో లా క‌మిష‌న్ పూర్తిగా నివేదిక ఇచ్చింద‌ని, కానీ దానిని ఆయ‌న చ‌దివితే ఇలా మాట్లాడి ఉండ‌ర‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా దేనినీ రుద్ద‌లేమ‌న్నారు పి. చిదంబ‌రం.

Also Read : Mari Selvaraj : ఎవ‌రీ మారి సెల్వ‌రాజ్

Leave A Reply

Your Email Id will not be published!