Jairam Ramesh Modi : అన్న భాగ్యకు కేంద్రం అడ్డుపుల్ల
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్
Jairam Ramesh Modi : కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కావాలని కర్ణాటక సర్కార్ ను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జైరాం రమేష్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. ఇందులో భాగంగా 5 హామీలను ప్రకటించింది. పేద కుటుంబాలకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నుండి బియ్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అయితే కర్ణాటక ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోశారు. కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించారు. పేదలకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బియ్యం అందజేస్తామని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీకి కూడా వెళ్లి వచ్చారు. ఆపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సహాయ సహకారాలు అందజేయాలని కోరారు సీఎం.
బియ్యం స్టాకులో నిండుగా ఉన్నప్పటికీ కావాలని పేదలకు బియ్యం పంపిణీ చేయకుండా కేంద్రం అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు జైరాం రమేష్(Jairam Ramesh). ఎంత ధర చెల్లించేందుకైనా తాము వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కిలోకు రూ. 34 లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కానీ అడ్డుపుల్ల వేస్తే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : National Geographic Magazine : డిస్నీ బిగ్ షాక్ జాబ్స్ కట్
