NCP Crisis : అజిత్ కు 24 మంది ఎమ్మెల్యేల‌ మ‌ద్ద‌తు

శ‌ర‌ద్ ప‌వార్ కు 14 మంది ఎమ్మెల్యేలు

NCP Crisis : మ‌రాఠాలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లో చీల‌క రావ‌డం, ఆ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పై అజిత్ ప‌వార్ ధిక్కార స్వ‌రం వినిపించారు. ఆపై రాజ్ భ‌వ‌న్ కు నేరుగా ఎమ్మెల్యేల‌తో క‌లిసి వెళ్లారు. తాము షిండే, ఫడ్న‌వీస్ స‌ర్కార్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెను వెంట‌నే సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర సమ‌క్షంలో గ‌వ‌ర్న‌ర్ అజిత్ ప‌వార్ చేత డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇదంతా ప‌క్క‌న పెడితే ఎన్సీపీ పార్టీ ప‌రంగా రాష్ట్రంలో గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 53 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక‌య్యారు. వీరిలో మొదట 36 మంది అజిత్ ప‌వార్ కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ సీన్ మారింది. ఆయ‌న వెంట వెళ్లింది కేవ‌లం 24 మంది మాత్ర‌మేన‌ని తేలింది. దీంతో శ‌ర‌ద్ పవార్ కు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా పార్టీ నిబంధ‌న‌ల‌ను తోసి రాజ‌ని జంప్ అయిన ఎమ్మెల్యేల‌పై వేటు వేస్తున్న‌ట్లు ఎన్సీపీ(NCP) చీఫ్ స్ప‌ష్టం చేశారు. ఇంకా 15 మంది మ‌ద్ద‌తు కావాల్సి ఉంటుంది ఫిరాయింపు చ‌ట్టం నుంచి త‌ప్పించు కోవాలంటే అజిత్ ప‌వార్ కు. క‌నీసం 36 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.

మ‌రో వైపు అజిత్ క్యాంపు న‌కు చేరిన ఎమ్మెల్యేల‌పై వేటు వేసేందుకు రెడీ అయ్యారు శ‌ర‌ద్ ప‌వార్. మ‌రో వైపు త‌న‌దే అస‌లైన నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అని ప్ర‌క‌టించారు అజిత్ ప‌వార్. మొత్తంగా మ‌రాఠా రాజ‌కీయం మ‌రింత పసందుగా మారడం విశేషం.

ఫిరాయింపు చట్టం నుంచి తప్పించుకోవడానికి అజిత్‌కు కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం

అజిత్ క్యాంప్‌పై అనర్హత పిటిషన్‌పై శరద్ పవార్ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నారు
@అజిత్ పవార్ మాట్లాడుతున్నారు

Also Read : Manish Sisodia : సిసోడియా బెయిల్ పిటిష‌న్ కొట్టివేత

Leave A Reply

Your Email Id will not be published!