Ajit Pawar VS Shinde : అజిత్ కు ఛాన్స్ షిండేకు షాక్
మరాఠాలో బీజేపీ బిగ్ ప్లాన్
Ajit Pawar VS Shinde : మహారాష్ట్రలో రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహా వికాస్ అఘాడీ సర్కార్ ను కూల్చిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని కూడా చీల్చింది. ఆ పార్టీకి చెందిన శరద్ పవార్ కు ఝలక్ ఇచ్చింది. ఎన్సీపీలో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ఉన్నట్టుండి 24 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్ కు మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆ వెంటనే రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన వర్గంలోని మరికొందరికి షిండే ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా దక్కడం విశేషం. ఇదిలా ఉండగా గతంలో శివసేన ఉద్దవ్ ఠాక్రే కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. సంకీర్ణ సర్కార్ కూలి పోయింది. దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఏక్ నాథ్ షిండే సీఎంగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొలువు తీరారు.
ఈ తరుణంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అజిత్ పవార్(Ajit Pawar) ను దగ్గరకు చేర్చింది. ఇదే క్రమంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో షిండేను సీఎంగా తప్పించి పవార్ కు సీఎం సీటు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు టాక్. ఇక ఎన్సీపీ నుంచి జంప్ అయిన అజిత్ పవార్ కు మరాఠాలో బలమైన పట్టుంది. ఆయనకు ప్రజల నుంచి మద్దతు కూడా ఉండడంతో తెలివిగా సర్కార్ లో చేర్చుకోవడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. మరి షిండే ప్లాన్ ఏమిటనేది వేచి చూడాలి.
Also Read : CBI File : లాలూ ఫ్యామిలీకి షాక్ సీబీఐ ఛార్జిషీట్