BS Yediyurappa : జేడీఎస్ తో పొత్తుపై యెడ్డీ కామెంట్స్

2024 ఎన్నిక‌ల్లో పొత్తుపై కీల‌క వ్యాఖ్య‌లు

BS Yediyurappa : క‌ర్నాట‌క‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేవెగౌడ సార‌థ్యంలోని జేడీఎస్ భార‌తీయ జ‌న‌తా పార్టీ క‌లిసి పోటీ చేయ‌నున్నాయా రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో. అవున‌నే అంటున్నారు బీజేపీ అగ్ర నేత‌, మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప‌(BS Yediyurappa). మంగ‌ళ‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. క‌లిసి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో అనుమానం ఎందుకు ఉండాల‌ని ప్ర‌శ్నించారు మాజీ సీఎం.

తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు కన్న‌డిగులు. 224 సీట్ల‌కు గాను ఏకంగా కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు కైవ‌సం చేసుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇక బీజేపీ 65 సీట్ల‌కే ప‌రిమితం కాగా కింగ్ పిన్ గా మారుతామంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి జేడీఎస్ పార్టీకి కేవ‌లం 19 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో ప‌వ‌ర్ లోకి కాదు క‌దా ఉన్న సీట్ల‌ను కోల్పోయింది.

ఇక చ‌క్రం తిప్పుతార‌ని భావించిన బీఎస్ యెడ్యూర‌ప్ప‌ను సైతం జ‌నం న‌మ్మ‌లేదు. ప్ర‌త్యేకించి లింగాయ‌త్ సామాజిక వ‌ర్గం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అది ఓట్ల రూపంలో వెల్ల‌డైంది. భారీ ఎత్తున కాంగ్రెస్ కు గంప గుత్త‌గా ఓట్లు వెళ్లాయి. ఇదే క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్లు సైతం కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వారిలో కీల‌క‌మైన లింగాయత్ నేత జ‌గ‌దీశ్ శెట్టర్ కూడా ఉన్నారు.

Also Read : AP CM YS Jagan : బాబు..ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒక్క‌టే – జ‌గ‌న్

 

Leave A Reply

Your Email Id will not be published!