PM Modi : పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్

ఉగ్ర‌వాదాన్ని ఉపేక్షించేది లేదు

PM Modi : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర‌వాదాంపై ఇక నుంచి ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా వారిని ఎదుర్కొనేందుకు భార‌త్ సిద్దంగా ఉంద‌ని అన్నారు ప్ర‌ధాని. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ పీఎం షెహ‌బాజ్ ష‌రీఫ్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మంగ‌ళ‌వారం షాంఘై స‌హ‌కార సంస్థ కీల‌క స‌మావేశంలో వ‌ర్చువ‌ల్ గా న‌రేంద్ర మోదీ(PM Modi) ప్ర‌సంగించారు. 2017లో ఎస్సీఓలో భార‌త్ , పాకిస్తాన్ స‌భ్య దేశాలుగా ఉన్నాయ‌ని తాము శాంతి కోసం ప్ర‌య‌త్నం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్ర‌వాదాన్ని, ట్రెర‌రిస్టుల‌ను పెంచి పోషిస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

తీవ్ర వాదం ఏ రూపంలో ఉన్నా తాము స‌హించ బోమంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు ఈమ‌ధ్య‌న ఎక్కువై పోయాయ‌ని, వాటిని ఎవ‌రు ఎందుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారో వారి అంత‌రాత్మ‌కు తెలుస‌న్నారు. ఇదే స‌మ‌యంలో టెర్ర‌రిజం ఇవాళ ప్ర‌పంచానికి స‌వాల్ గా మారింద‌న్నారు. దీనిని ఎదుర్కోవ‌డంలో ఆయా దేశాలు ప్ర‌త్యేకించి పాకిస్తాన్ ద్వంద్వ ప్ర‌మాణాలు పాటించ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

Also Read : BS Yediyurappa : జేడీఎస్ తో పొత్తుపై యెడ్డీ కామెంట్స్

 

Leave A Reply

Your Email Id will not be published!