Purandeswari : భారతీయ జనతా పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చింది. కొత్త వారిని ఎంపిక చేసింది. తెలంగాణ కు కిషన్ రెడ్డిని నియమించింది. ఇక ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజును తప్పించింది. ఆయన స్థానంలో దివంగత సీఎం నందమూరి తారక రామారావు కూతురు, బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది.
ఆమె కేంద్రంలో సహాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 14వ లోక్ సభకు బాపట్ల నుంచి ఎన్నికయ్యారు. న్యాయ శాఖ మంత్రిగా , 15వ లోక్ సభకు ఎన్నికై మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాలలో అపారమైన అనుభవం కలిగిన నాయకురాలిగా గుర్తింపు పొందారు దగ్గుబాటి పురంధేశ్వరి(Purandeswari). ఆయన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు.
ఇదే సమయంలో ఏపీకి చెందిన ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. ఆయన ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జాతీయ స్థాయి కార్యవర్గంలో చోటు కల్పించింది పార్టీ హైకమాండ్. బీజేపీలో చేసిన మార్పులు రాబోయే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read : Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి
