Kiran Kumar Reddy : కిర‌ణ్ కుమార్ రెడ్డికి కీల‌క పోస్ట్

జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియామ‌కం

Kiran Kumar Reddy : ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డికి కీల‌క ప‌ద‌వి ల‌భించింది. ఇటీవ‌లే ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగ‌ళ‌వారం పార్టీ హై క‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌లు రాష్ట్రాల పార్టీ అధ్య‌క్షుల‌ను మార్చేసింది. ఏపీకి దివంగ‌త ఎన్టీఆర్ కూతురు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రిని నియ‌మించింది. ఇప్ప‌టి దాకా ఉన్న సోమూ వీర్రాజును త‌ప్పించింది.

ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న దృష్ట్యా రాజ‌కీయ రంగంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy). ఈ మేర‌కు ఆయ‌న‌కు పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిగా నియ‌మించింది. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో ఆయ‌న సేవ‌ల‌ను వాడుకోవాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇదిలా ఉండ‌గా కిర‌ణ్ కుమార్ రెడ్డికి రెడ్డి సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. అటు ఏపీలో ఇటు తెలంగాణ‌లో కూడా అన్ని పార్టీల నాయ‌కుల‌తో స‌త్ సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంద‌ని న‌మ్మ‌కం. మొత్తంగా కిర‌ణ్ కుమార్ రెడ్డికి కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.

Also Read : Eatala Rajender : ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ గా ఈట‌ల

 

Leave A Reply

Your Email Id will not be published!