BJP Appoints : రాష్ట్రాలకు బీజేపీ కొత్త చీఫ్ లు
కీలక నిర్ణయం తీసుకున్న హైకమాండ్
BJP Appoints : రాబోయే ఎన్నికల వేళ కీలక మార్పులు చేసింది భారతీయ జనతా పార్టీ . ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు పార్టీల అధ్యక్షులను మార్చేసింది. ఏపీకి దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించింది. ఇక తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇదే ప్రాంతానికి చెందిన ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమించింది. మరో వైపు ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది.
2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో దేశంలోని 5 రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంజాబ్ లో జాతీయత, ఐక్యతకు మద్ధతు ఇవ్వాలని కోరుతూ గత ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ అయిన మాజీ ఎంపీ సునీల్ కుమార్ జాఖర్ కు రాష్ట్ర బీజేపీ(BJP) చీఫ్ గా బాధ్యతలు అప్పగించింది పార్టీ హై కమాండ్.
మరో వైపు జార్ఖండ్ తొలి సీఎంగా పేరు పొందిన, ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మరాండీని బీజేపీ చీఫ్ గా నియమించింది. ఇక జూలై 7న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర ఇన్ ఛార్జ్ లతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ సమావేశానికి తనతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అధ్యక్షత వహిస్తారు.
Also Read : Kiran Kumar Reddy : కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పోస్ట్
