Bandi Sanjay : రాష్ట్రానికి అధ్యక్షుడిగా పని చేసినందుకు సంతోషంగా ఉందన్నారు పార్టీ పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్. ఈ సందర్బంగా సామాన్య కార్యకర్తను గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి, పీఎం మోదీకి, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు, పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ చీఫ్ గా తాను రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడేలా చేయడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నానని తెలిపారు.
అందించిన మద్దతు ,ప్రేమ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్(Bandi Sanjay). కిషన్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు . ఇవాళ నన్ను ఇంతటి స్థాయికి తీసుకు వచ్చేలా చేసిన కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఓటర్లకు , కార్యకర్తలకు రుణపడి ఉన్నానని పేర్కొన్నారు బండి సంజయ్. నా పదవీ కాలంలో తాను ఎవరినైనా బాధ పెడితే మన్నించాలని కోరారు.
ఇదిలా ఉండగా మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకుంది పార్టీ హైకమాండ్. ఐదు రాష్ట్రాలకు పార్టీ చీఫ్ లను నియమించింది. ఈటల రాజేందర్ కు కీలక పోస్ట్ అప్పగించింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టింది.
Also Read : BJP Focus : ఎన్నికలపై నజర్ బీజేపీ ఫోకస్
