KTR : మెడికల్ హబ్ గా తెలంగాణ రూపు దిద్దుకుంటోందన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మెడ్ టెక్ స్పేస్ లో చాలా మంది పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులను కలిసే అద్భుతమైన అవకాశాన్ని తాను పొందానని స్పష్టం చేశారు.
భారత దేశపు అతి పెద్ద పని చేసే వైద్య పరికరాల పారిశ్రామిక క్లస్టర్ గా మారిందన్నారు. మెడికల్ డివైజెస్ పార్క్ తో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలలో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మెడ్ టెక్ రంగానికి పూర్తిగా సహాయ సహకారాలు అందజేశామని తెలిపారు కేటీఆర్(KTR).
తెలంగాణ, ప్రపంచం కోసం తెలంగాణలో ప్రపంచ స్థాయి వైద్య ఉత్పత్తులను సగర్వంగా అభివృద్ది చేస్తున్నామని వెల్లడించారు మంత్రి. స్వదేశీ కంపెనీలు వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా కష్ట కాలంలోనూ ఫార్మా కంపెనీలు విస్తృతంగా సేవలు అందించాయని వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్లను తయారీ చేసిన వాటిలో మన హైదరాబాద్ కు చెందిన కంపెనీలు కూడా ఉండడం మనకందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యంగా ఫార్మా కంపెనీలకు తోడ్పాటు అందజేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read : Bandi Sanjay : నొప్పిస్తే మన్నించండి – బండి
