Kumara Swamy : క‌ర్ణాట‌క స‌ర్కార్ పై కుమార కన్నెర్ర‌

అంతా పెన్ డ్రైవ్ లో ఉంద‌ని ఆరోప‌ణ‌

Kumara Swamy : జేడీఎస్ చీఫ్ , మాజీ సీఎం కుమార స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన బ‌దిలీల్లో అంతులేని అవినీతి జ‌రిగింద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి త‌న వ‌ద్ద పెన్ డ్రైవ్ ఉంద‌ని, అందులో ప్రూఫ్స్ ఉన్నాయ‌ని ఆరోపించారు కుమార స్వామి.

బ‌దిలీ సిండికేట్ కు సంబంధించి త‌న వ‌ద్ద త‌గినంత ఆధారాలు ఉన్నాయ‌ని ఇప్పుడు ఏమంటారంటూ ప్ర‌శ్నించారు. త‌న జేబులో నుంచి పెన్ డ్రైవ్ ను కూడా తీసి చూపించారు. ఇంధ‌న శాఖ‌లో 2 ట్రాన్స్ ఫ‌ర్స్ చోటు చేసుకున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.10 కోట్లు ఇచ్చారంటూ ఆరోపించారు కుమార స్వామి(Kumara Swamy). బ‌దిలీ అయిన వారిలో రోజుకు రూ. 50 ల‌క్ష‌లు సంపాదిస్తారంటూ పేర్కొన్నారు మాజీ సీఎం.

పెన్ డ్రైవ్ లో ఏముందని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు అవినీతికి సంబంధించిన ఆడియో అందులో ఉంద‌న్నారు . మాండ్యాలో జిల్లా ఆరోగ్య అధికారి బ‌దిలీని ఈ సంద‌ర్బంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు హెచ్ డి కుమార స్వామి. అయితే తాజ్ వెస్ట్ ఎండ్ హోట‌ల్ లో బ‌స చేసినందుకు త‌న‌ను అవ‌హేళ‌న చేయ‌డాన్ని కాంగ్రెస్ పార్టీని త‌ప్పు ప‌ట్టారు. నేను నెల‌కు రూ. 2 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌లేనా అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం.

Also Read : PM Modi : శాంతికి ప్ర‌తిరూపం ద‌లై లామా

 

Leave A Reply

Your Email Id will not be published!