Mallikarjun Kharge : రాజస్థాన్ లో మళ్లీ మాదే అధికారం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : రాజస్థాన్ లో తిరిగి తామే అధికారంలోకి వస్తామని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా సేవ, ఉప శమనం, అందరి ఉద్దరణ కోసం కృషి చేస్తున్నారంటూ సీఎం అశోక్ గెహ్లాట్ ను ప్రశంసించారు. ప్రస్తుతం రాజస్థాన్ ప్రగతి పథంలో ప్రయాణం చేస్తోందని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే.
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లోని ప్రతి ఇంటికి సమ్మిళిత అభివృద్ది, ప్రజా సంక్షేమ పథకాలను తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యిందని తెలిపారు ఏఐసీసీ చీఫ్. రానున్న ఎన్నికల్లో పార్టీని ఏకం చేసి ప్రజల్లోకి వెళతామని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). రాష్ట్రంలోని ప్రతి వర్గం రైతులు, రైతు కూలీలు, యువత, మహిళలు , సమాజం లోని ప్రతి వర్గం పార్టీపై విశ్వాసం వ్యక్తం చేస్తోందన్నారు.
అందరి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రజలు, భవిష్యత్తు రెండూ కాంగ్రెస్ పార్టీ చేతిలో భద్రంగా ఉన్నాయని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే. ఈసారి చరిత్ర తిరగ రాయడం ఖాయమని జోష్యం చెప్పారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తాము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
Also Read : AP CM YS Jagan : పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
