Bandi Sanjay Slams : ర‌ఘునంద‌న్ పై బండి ఫిర్యాదు

చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్

Bandi Sanjay Slams : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుండి వైదొలిగిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న త‌న‌పై , పార్టీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బుద్వేల్ ఎమ్మెల్యే ర‌ఘు నంద‌న్ రావు నిప్పులు చెరిగారు. పార్టీ హై క‌మాండ్ కు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ బీజేపీలో నేత‌లు గ్రూపులుగా విడి పోయారు. ఈట‌ల త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న‌తో పాటు కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డికి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది. ఇదే స‌మ‌యంలో బండిని మార్చేసింది..ఆయ‌న స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిష‌న్ రెడ్డిని నూత‌న బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మించింది.

ఇదే స‌మ‌యంలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. బండి సంజ‌య్(Bandi Sanjay) పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ర‌ఘునంద‌న్ రావు. ఒక‌ప్పుడు భార్య పుస్తెలు అమ్మి కార్పొరేట‌ర్ గా బ‌రిలోకి దిగిన బండికి ర‌.100 కోట్లు యాడ్స్ ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడ‌ని ప్ర‌శ్నించారు. ఆపై పార్టీపై కూడా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఆపై కిష‌న్ రెడ్డికి ఏం అర్హ‌త ఉందో త‌న‌కు కూడా ఉంద‌న్నారు.

త‌న‌కు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి లేదా ఫ్లోర్ లీడ‌ర్ కాదంటే జాతీయ అధికార ప్ర‌తినిధి పోస్టుల‌లో ఏదో ఒక‌టి ఇవ్వాల‌ని ఇందుకు తాను అర్హుడ‌న‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా రిలీజైంది. ప్ర‌కంప‌న‌లు రేపింది.

Also Read : Mallikarjun Kharge : రాజ‌స్థాన్ లో మ‌ళ్లీ మాదే అధికారం

Leave A Reply

Your Email Id will not be published!