Arvind Kejriwal : రోబోటిక్స్ తో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నూత‌న టెక్నాల‌జీ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న ఢిల్లీలో రోబోటిక్స్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని టెక్నాల‌జీ ఎంత‌గా ప్ర‌భావితం చేస్తోందో చెప్పారు. దేశంలోని విద్యా వ్య‌వ‌స్థ ఇంజ‌నీర్లు త‌యార‌య్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు..కానీ సాధార‌ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల పిల్ల‌లు సాధార‌ణ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు సీఎం. ఢిల్లీ రోబోటిక్స్ లీగ్ లో పాల్గొనే అన్ని జ‌ట్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

దేశంలో ఎక్క‌డా లేని విధంగా విద్యా రంగాన్ని అభివృద్ది చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇవాళ బ‌డుల్లో చ‌దువుకుంటున్న పిల్ల‌లు ఇంజ‌నీర్ల‌ను ఢీకొనే స్థాయికి చేరుకున్నార‌ని, ఇది చూసి త‌న‌కు ఎంతో ఆనందం క‌లుగుతోంద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఏ దేశ‌మైనా విద్య‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంద‌ని కానీ కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం మాత్రం విద్యా రంగాన్ని స‌ర్వ నాశ‌నం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా తాము తీర్చి దిద్దామ‌న్నారు. ఇవాళ త‌మ పిల్ల‌లు రోబోటిక్స్ తో ప్ర‌యోగాలు చేసే స్థాయికి ఎదిగార‌ని కొనియాడారు.

Also Read : Bandi Sanjay Slams : ర‌ఘునంద‌న్ పై బండి ఫిర్యాదు

 

Leave A Reply

Your Email Id will not be published!