KC Venu Gopal : ఇంటింటి ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్
వెల్లడించిన నేత కేసీ వేణు గోపాల్
KC Venu Gopal : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా తమ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తారని తెలిపారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బాధ్యులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటిస్తారని తెలిపారు.
రాబోయే 90 రోజులకు సంబంధించి ప్రచారంపై ఫోకస్ పెడతామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం గెహ్లాట్ ప్రభుత్వం మేనిఫెస్టోను విడుదల చేసిందని చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వివరిస్తారని తెలిపారు కేసీ వేణుగోపాల్(KC Venu Gopal).
సీఎం అశోక్ గెహ్లాట్ ఇతర సీనియర్లతో కలుపుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేశారని స్పష్టం చేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బంపర్ మెజారిటీ సాధించడం ఖాయమన్నారు. బీజేపీకి అంత సీన్ లేదన్నారు. తాము ఎవరి గురించి పట్టించుకోవడం లేదన్నారు కేసీ వేణుగోపాల్.
రాబోయే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కర్ణాటకలో వెల్లడైన ఫలితాలు రావడం ఖాయమని జోష్యం చెప్పారు కేసీ వేణుగోపాల్. బీజేపీ పనై పోయిందన్నారు.
Also Read : Revanth Reddy : ధరణిపై విచారణ చేపట్టాలి – రేవంత్
