SCR AGM : షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే రైల్లో మంట‌లు

సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జీఎం జైన్

SCR AGM : యాదాద్రి జిల్లాలో హౌరా నుంచి సికింద్రాబాద్ వ‌ర‌కు ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు శుక్ర‌వారం ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న వెనుక ఏమైనా కార‌ణం ఉందా అన్న అనుమానం వ్య‌క్త‌మైంది. ఇందుకు సంబంధించి గ‌త మూడు రోజుల కింద‌ట ఓ బెదిరింపు లేఖ రావ‌డంపై కూడా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి 11 బోగుల‌కు గాను 7 బోగీలు ద‌గ్ధ‌మ‌య్యాయి. బోగీల‌ను బీబీ న‌గ‌ర్ కు త‌ర‌లించారు.

అక్క‌డి నుంచి ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ మెల్ల‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ కు చేరుకుంది. ఇదిలా ఉండ‌గా ఫ‌ల‌క్ నుమా వ‌స్తుండ‌గా ఉన్న‌ట్టుండి బోగీల నుంచి పొగ‌లు రావ‌డం మొద‌లు అయ్యాయి. దీనిని చూసిన ప్ర‌యాణీకులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఇందులో ఒక‌రు తెలివిగా ట్రైన్ బోగీలో ఉన్న చైన్ ను లాగారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు రైల్వే సిబ్బంది. త‌క్ష‌ణ‌మే ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపి వేశారు. భ‌యంతో ప్ర‌యాణీకులు బోగీల నుంచి దూకేశారు.

మ‌రికొంద‌రిని ర‌క్షించారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇక విష‌యం తెలుసుకున్న వెంట‌నే హుటా హుటినా యాదాద్రి జిల్లాకు చేరారు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే(SCR) శాఖ జీఎం జైన్. ఇదిలా ఉండ‌గా ఫ‌ల‌క్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంట‌లు చెల‌రేగ‌డం వెనుక ఎలాంటి విద్రోహ చ‌ర్య లేద‌న్నారు. అయితే ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని చెప్పారు. ఇది కేవ‌లం షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లనే మంట‌లు చెల‌రేగాయ‌ని పేర్కొన్నారు.

Also Read : KTR Slams : గాంధీ భ‌వ‌న్ లో గాడ్సేలు – కేటీఆర్

 

Leave A Reply

Your Email Id will not be published!