PM Modi Visit : భ‌ద్ర‌కాళి గుడిలో మోదీ పూజ‌లు

అమ్మ వారికి పూజ‌లు చేసిన ప్ర‌ధాని

PM Modi Visit : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శ‌నివారం ఓరుగ‌ల్లుకు చేరుకున్నారు. మామూనురులో కొలువు తీరిన భ‌ద్ర‌కాళి ఆల‌యంలో కొలువు తీరిన మ‌హంకాళి అమ్మ వారికి మోదీ పూజ‌లు చేశారు. ఆయ‌న‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. గుడిలో ఉన్న గోశాల‌ను సంద‌ర్శించారు మోదీ.

గోవుల‌కు తినిపించారు ప్ర‌ధాన‌మంత్రి. పూజ‌లు చేసిన మోదీకి ఆశీర్వ‌చ‌నం అందించారు పూజారులు. అమ్మ వారికి 15 నిమిషాల‌కు పైగా పూజ‌లు చేయ‌డం విశేషం. అనంత‌రం 5 నిమిషాల ధ్యానంలో పాల్గొన్నారు.

అక్క‌డి నుంచి ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). అక్క‌డ కేంద్ర స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టనున్న రూ. 6,000 కోట్లతో చేప‌ట్ట‌నున్న‌జాతీయ ర‌హ‌దారుల అభివృద్ది చేసేందుకు భూమి పూజ చేశారు. ఇదే స‌మ‌యంలో రూ. 521 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న రైల్వే వ్యాగ‌న్ యూనిట్ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఈ సంద‌ర్భంగా మోదీ తెలుగులో ప్ర‌సంగించారు. దేశ అభివృద్దిలో తెలంగాణ కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంద‌ని కితాబు ఇచ్చారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : KTR Modi : మోదీ ఇచ్చిన హామీల మాటేంటి

Leave A Reply

Your Email Id will not be published!