Nallari Kiran Kumar Reddy Modi : నెట్టింట్లో న‌ల్లారి వైర‌ల్

మోదీకి మాజీ సీఎం వెల్ క‌మ్

Nallari Kiran Kumar Reddy Modi : ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌కు ముందు సీఎంగా కూడా ప‌ని చేశారు. ఆయ‌న ఎవ‌రో కాదు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ‌పై సీరియ‌స్ కామెంట్స్ చేసినా పోస్టుల భ‌ర్తీ విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు సేవ‌లు అందించిన కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్న‌ట్టుండి రూట్ మార్చారు. ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి, స‌మాజంలో ఓ అరుదైన గౌర‌వాన్ని, గుర్తింపు ను కాద‌నుకున్నారు. ఆపై కాషాయ కండువా క‌ప్పుకున్నారు. తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారేందుకు ఇప్ప‌టి నుంచే పావులు క‌దిపేందుకు రెడీ అయ్యారు.

ఇదిలా ఉండ‌గా శ‌నివారం తెలంగాణ‌లో అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టేందుకు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి కి న‌రేంద్ర మోదీకి గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు. ఈ సంద‌ర్బంగా తీసిన ఫోటో వైర‌ల్ గా మారింది. మంచి విద్యాధికుడైన కిర‌ణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కి బీజేపీ చేరిన వెంట‌నే జాతీయ కార్య‌వ‌ర్గం లోకి తీసుకుంది.

ఇప్ప‌టికే త‌న కేబినెట్ లో ఒక‌ప్పుడు ప‌ని చేసిన మాజీ మంత్రి డీకే అరుణ కూడా బీజేపీలోనే ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఇటు తెలంగాణ‌లో కీల‌క పాత్ర పోషించాల‌ని భావిస్తున్నారు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి. ఏది ఏమైనా ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన ఫోటో మాత్రం వైర‌ల్ గా మార‌డం విశేషం. ప‌ద‌వి కోసం నేత‌లు ఎలాగైనా మారి పోతారు అన్న దానికి ఇది ఓ ఉదాహ‌ర‌ణ‌.

Also Read : BJP Fire Police : ఖాకీల తీరుపై కాషాయ నేత‌ల క‌న్నెర్ర‌

 

Leave A Reply

Your Email Id will not be published!