Heavy Rains : ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశంలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి జన జీవనం స్తంభించి పోయింది. ఇక దేశ రాజధాని హస్తినలో గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం భీభత్సం సృష్టించింది. ఇక ఉత్తర భారత దేశంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.
గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 12 మంది మరణించారు. ఓ వైపు వాగులు, వంకలు నిండి పోయాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీట మునిగాయి పలు చోట్ల. మరో వైపు వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లవద్దంటూ సూచించింది.
ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ , రాజస్థాన్ , పంజాబ్ , జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది ప్రజలను. ఆదివారం ఢిల్లీని వర్షం ముంచెత్తింది. కురుస్తున్న వానతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు చోట్ల ఇళ్లు కూలి పోయాయి.
Also Read : Pakistan Sports Minister : పాక్ ఆడాలంటే పీఎం ఓకే చెప్పాలి
