Sunil Gavaskar : సీనియ‌ర్ల ఫిట్ నెస్ పై స‌న్నీ కామెంట్స్

జ‌ట్టు ఎలా గెలుస్తుందంటూ మండిపాటు

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌త జ‌ట్టులో సీనియ‌ర్ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు జూలై 12 నుంచి విండీస్ టూర్ లో త‌న మ్యాచ్ లు ఆడుతుంది. ఇందులో 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టి20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇప్ప‌టికే బీసీసీఐ టెస్టు జ‌ట్టును ఎంపిక చేసింది. ఇక బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ గా ఎంపికైన అజిత్ అగార్క‌ర్ వ‌న్డే, టి20 సీరీస్ ల‌కు జ‌ట్ల‌ను ఎంపిక చేశాడు.

ప్ర‌ధానంగా భార‌త జ‌ట్టు సీనియ‌ర్ ఆటగాళ్ల తీరుపై మండిప‌డ్డారు స‌న్నీ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar). కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ల‌ను ఫిట్ నెస్ స‌రిగా లేద‌న్న కారణంతో ప‌క్క‌న పెట్టాడు అజిత్ అగార్క‌ర్. మ‌రో ఆట‌గాడు కేఎల్ రాహుల్ తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డిని ఎంపిక‌లోకి తీసుకోలేదు.

ఈ సంద‌ర్భంగా ప‌దే ప‌దే సీనియ‌ర్లు ఎందుకు ఆట‌కు దూరంగా ఉంటున్నారో బీసీసీఐ ఆలోచించాల‌ని సూచించాడు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్. కాగితాల్లో గొప్ప క్రికెట‌ర్లు..కానీ మైదానంలో మాత్రం స‌త్తా చాట‌లేక పోతున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ఇంకా బీసీసీఐ స్పందించ లేదు.

Also Read : Vijayendra Prasad RRR Sequel : ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్

 

Leave A Reply

Your Email Id will not be published!