Punjab CM : బాధితులకు సీఎం మాన్ భ‌రోసా

భారీగా కురుస్తున్న వ‌ర్షాలు

Punjab CM : దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఉత్త‌ర భార‌తం దేశాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో భారీ ఎత్తున ప్రాణ న‌ష్టం చోటు చేసుకుంది. ఇళ్లు కూలి పోయాయి. ప‌లుచోట్ల వ‌ర‌ద తాకిడికి కార్లు, బైక్ లు కొట్టుకు పోయాయి. ఈ త‌రుణంలో య‌మునా న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. ఢిల్లీని వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. మ‌రో వైపు పంజాబ్ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ ఎత్తున వ‌ర్సాల తాకిడికి ప‌లువురు నిరాశ్ర‌యుల‌య్యారు.

ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి పంజాబ్ సీఎం(Punjab CM) భ‌గ‌వంత్ మాన్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. మ‌రో వైపు పీఎం న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి సైతం ఆయా ప్రాంతాల‌లో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు కూడా రంగంలోకి దిగాయి.

మ‌రో వైపు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సోమ‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. దేశ రాజ‌ధాని హ‌స్తిన‌లో య‌మునా న‌ది ప‌క్క‌నే ఉన్న వారంద‌రినీ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ఈ త‌రుణంలో సిబ్బందితో క‌లిసి సీఎం భ‌గ‌వంత్ మాన్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చారు.

Also Read : Sunil Gavaskar : సీనియ‌ర్ల ఫిట్ నెస్ పై స‌న్నీ కామెంట్స్

 

Leave A Reply

Your Email Id will not be published!