Jana Sena Alla Nani : ఆళ్ల నానికి మతి చెడింది – జనసేన
దృష్టి లోపం..వినికిడి లోపం ఉంది
Jana Sena Alla Nani : ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై నిప్పులు చెరిగింది జనసేన పార్టీ. తమ చీఫ్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ విషయం తెలుసు కోకుండా అవాకులు పేలితే ఎలా అని ప్రశ్నించింది. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. సోమవారం ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ పలు ప్రశ్నలు సంధించింది ఏలూరు ఎమ్మెల్యేకు .
కళ్లుండి చూడలేని కబోధిలాగా ఆళ్ల నాని(Alla Nani) మాట్లాడుతున్నారని, ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేసింది. పొద్దస్తమానం సీఎం జగన్ భజన చేసుకుంటూ పోతే ఇక ప్రజా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారంటూ నిలదీసింది జనసేన పార్టీ.
గత 25 రోజులుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా సంక్షేమం కోసం గొంతు చించుకుని పవన్ కళ్యాణ్ అరుస్తున్నాడని కానీ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని జన సేన ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత , 2 ఏళ్ల పాటు ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసినా ఇంకా ఏలూరు లో ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలకే పరిమితం కావడం మీ అసమర్థతకు నిదర్శనమని ఎద్దేవా చేసింది.
పవన్ కళ్యాణ్ కాగ్ నివేదిక బయట పెట్టిన విషయాల గురించే మాట్లాడాడని , ఆధారాలు లేకుండా తమ నేత బయటకు చెప్పరని తెలిపింది జనసేన.
Also Read : Vijay Sai Reddy : తెలుగుదేశం నీచ రాజకీయం
