Ponguleti Srinivas Reddy : కేసీఆర్ గద్దె దిగే దాకా పోరాటం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత పదవుల కోసం తాము పని చేయడం లేదన్నారు. కేవలం పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నామని చెప్పారు. ఈనెలారు నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కీలక నేతలు క్యూ కడుతున్నారని, వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని జోష్యం చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
కాంగ్రెస్ లో చేరే నేతల సంఖ్య రెండు అంకెల్లో ఉంటుందన్నారు. అయితే సీఎం కేసీఆర్ ను గద్దె దించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇటీవలే ఖమ్మం లో నిర్వహించిన జన గర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతే కాదు ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయనని శపథం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ఆయనో బచ్చా అంటూ కామెంట్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇదే సమయంలో తనతో పోటీ చేసే అర్హత మంత్రి కి లేదన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు అంత సీన్ లేదన్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. తాము పవర్ లోకి వస్తామని , కల్వకుంట్ల అక్రమాలను బయట పెడతామని ప్రకటించారు.
Also Read : Shahrukh Khan Jawan : పిచ్చెక్కిస్తున్న ‘బాద్ షా’
