Congress Meeting : 20న కొల్లాపూర్ లో ప్రియాంక స‌భ‌

కాంగ్రెస్ లో చేర‌నున్న జూప‌ల్లి , కూచుకుళ్ల‌

Congress Meeting : తెలంగాణ‌లో కాంగ్రెస్ జోష్ పెంచుతోంది. రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఆ పార్టీలో సీన్ మొత్తం మార్చేశారు. త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని రంగరించి అస‌మ్మ‌తి అనేది లేకుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేలా ఖ‌మ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన జ‌న గ‌ర్జ‌న స‌భ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. ల‌క్ష‌లాది జ‌నం స్వ‌చ్చంధంగా త‌ర‌లి వ‌చ్చారు.

ఆ స‌భ‌లో ఖ‌మ్మంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేర‌డం ఆ పార్టీకి మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా చేసింది. దీంతో ప్ర‌తి 15 రోజుల‌కు ఒక‌సారి భారీ స‌భ‌ను చేప‌ట్టాల‌ని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్(Congress) . టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ ఆ పార్టీకి కొంత ఇబ్బంది క‌లిగిస్తున్నా అధికార పార్టీపై వ్య‌తిరేకత ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు హ‌స్తం వైపు చూసేలా చేస్తున్నాయి.

ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జూలై 20న కొల్లాపూర్ లో భారీ స‌భ‌కు ప్లాన్ చేసింది. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ రానున్నార‌. ఆమె స‌మ‌క్షంలో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి హ‌స్తం గూటికి చేర‌నున్నారు.

Also Read : YS Sharmila : స్కీంల పేరుతో కేసీఆర్ మోసం

 

Leave A Reply

Your Email Id will not be published!