Dasoju Sravan : రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
డాక్టర్ దాసోజు శ్రవణ్ ఫైర్
Dasoju Sravan : బ్లాక్ మెయిల్ చేసి బతికేటోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ అగ్ర నేత దాసోజు శ్రవణ్ కుమార్. మంగళవారం ఆయన ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఇంట్లో 24 గంటలు కరెంట్ ఉండాలి..కానీ సాగు చేసే రైతులకు వద్దా అని ప్రశ్నించారు. మూడు గంటల్లో మూడు ఎకరాలకు నీళ్లు ఎట్లా పారుతాయో తెలియని దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
అన్నదాతలను అవమానపర్చిన టీపీసీసీ చీఫ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కాంగ్రెస్ గా మార్చేశాడంటూ ఆరోపించారు. ఇవి రేవంత్ అంటున్నట్లుగా లేవని ఆయనతో చంద్రబాబు నాయుడు అనిపిస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan). చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వంపై , ఆత్మ గౌరవంపై దాడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ రైతులకు అండగా నిలిస్తే రేవంత్ రెడ్డి దానిని తట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంట్ కోసం అరిగోస పడ్డారని అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తిరిగి రైతులు చీకట్లోకి వెళ్లి పోయేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ మండిపడ్డారు దాసోజు శ్రవణ్. నిన్న ధరణి వద్దన్నాడు..ఇవాళ కరెంట్ కూడా అవసరం లేదంటున్నాడంటూ ఫైర్ అయ్యారు.
Also Read : Kodali Nani : నా ఆరోగ్యానికి ఢోకా లేదు – కొడాలి నాని
