Nara Lokesh : విశాఖ‌ను ఐటీ రాజ‌ధాని చేస్తాం

టీడీపీ నేత నారా లోకేష్ ప్ర‌క‌ట‌న

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించేందుకు చిత్త శుద్దితో కృషి చేస్తామ‌న్నారు. విశాఖ‌ను ఐటీ క్యాపిట‌ల్ గా అభివృద్ది ప‌రుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర ఏపీలో కొన‌సాగుతోంది. యాత్ర‌లో భాగంగా ఆయ‌న అరుదైన మైలు రాయిని చేరుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు యాత్ర ప్రారంభించి 2,000 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్నారు.

కుప్పం శ్రీ వ‌ర‌ద రాజ స్వామి పాదాల చెంత తొలి అడుగుతో ప్రారంభ‌మైంది యువ గ‌ళం. జ‌న స్వ‌ర‌మై మ‌హా ప్ర‌భంజ‌న‌మై కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాల‌న‌ను నిరంత‌రం ఎండ‌గ‌డుతూ ముందుకు వెళుతున్నారు నారా లోకేష్(Nara Lokesh). తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యవ‌సాయ శాఖా మంత్రిపై నిప్పులు చెరిగారు నారా లోకేష్. ఆయ‌న‌కు మ‌ద్యంపై ఉన్నంత అవ‌గాహ‌న రైతుల‌కు సంబంధించిన పంట‌ల‌పై సోయి లేకుండా పోయింద‌న్నారు. కావలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్త‌ప‌ల్లి వ‌ద్ద 2 వేల కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఆక్వా రైతుల‌కు హామీ ఇచ్చారు నారా లోకేష్.

Also Read : RK Roja : జ‌గ‌న్ సింహం లాంటోడు – ఆర్కే రోజా

 

Leave A Reply

Your Email Id will not be published!