Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. ఒక రకంగా పార్టీలో ఉంటూనే ప్రశ్నించడం చేస్తూ వచ్చారు. ఒక రకంగా రెబల్ గా గుర్తింపు పొందారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నది లేక పోతే అది మనజాలదని పదే పదే చెబుతున్నారు. ఆయన ఎంపీగానే కాదు మంచి క్రికెట్ లవర్ కూడా. అంతకు మించిన వక్త, అనలిస్ట్, అద్భుతమైన రచయిత.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని అంశాల పట్ల శశి థరూర్ కు అవగాహన ఉంటుంది. కొత్త కొత్త పదాలను వాడడం, ఉపయోగించడం ఎంపీకి సరదా. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ సమూహం ఉంటుంది. దేశంలో ఎక్కడ బుక్ ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళతారు. శశి థరూర్(Shashi Tharoor) కు చాలా మంది పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా లెక్కకు మించిన ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో పాకిస్తాన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ ఒకరు వచ్చి పలకరించడంతో విస్తు పోయారు.
ఆయన సోషల్ మీడియాలో అత్యంత చురుకుగా ఉంటారు. ఆపై ఆలోచనలు రేపే ప్రశ్నలు సంధిస్తారు. తాజాగా ముంబైలో రోటరీ క్లబ్ ఆఫ్ బాంబే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. 500 మందికి పైగా ప్రముఖులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినా తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చారు శశి థరూర్. ఫరా ఖాన్ థరూర్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం.
Also Read : CM Shinde : తండ్రిని మరిచి పోయిన ఉద్దవ్ ఠాక్రే
