kaluva Srinivasulu : వైసీపీ నేతలకు పంటల బీమా
మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు
kaluva Srinivasulu : టీడీపీ అగ్ర నేత, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు. రైతులకు రావాల్సిన పంటల బీమాను అధికారంలో ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలకు దక్కుతోందంటూ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ల కోసమే వైఎస్సార్ పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారంటూ మండిపడ్డారు. అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా సొమ్మును తన పార్టీ వారికి దోచి పెడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రైతులకు చిల్లర ఇచ్చేందుకు సీఎం ప్రత్యేక విమానంలో రావడం దారుణమన్నారు.
పంటలు వేయక పోయినా వైసీపీ నేతలకు పరిహారం ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కోల్పోయిన రైతులను అన్యాయం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలువ శ్రీనివాసులు(Kaluva Srinivasulu). పైకి తమది రైతుల సంక్షేమ ప్రభుత్వం అంటూ మరో వైపు పంటల బీమా సొమ్మును అప్పనంగా తమ పార్టీ వారికి అప్పగిస్తే ఎలా అని నిలదీశారు.
ఖరీఫ్ లో పంటల బీమా కట్టకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారంటూ జగన్ రెడ్డిపై భగ్గుమన్నారు కాలువ శ్రీనివాసులు. రబీలో కూడా ఒక్క పైసా కూడా కట్ట లేదని కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో చూస్తే తెలుస్తుందన్నారు.
Also Read : Daggubati Purandeswari : ఏపీకి కేంద్రం రూ.20 వేల కోట్లు