Opposition Meet : రేపే విపక్షాల కీలక సమావేశం
24 భావ సారూప్య పార్టీలకు ఆహ్వానం
Opposition Meet : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు పావులు కదిపాయి. ఇప్పటికే పీడీఎఫ్ పేరు పెట్టారు. విపక్షాల ఐక్యత కోసం పెద్ద ఎత్తున కృషి చేశారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన సారథ్యంలో 17 పార్టీల నేతలు పాట్నాలో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమావేశంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ సమావేశం స్థలాన్ని మార్చారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సిమ్లా నుంచి బెంగళూరుకు మార్చారు. రేపటి నుంచి జూలై 17, 18 తేదీలలో రెండు రోజుల పాటు విపక్షాల సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ భావ సారూప్య పార్టీలకు విందు ఏర్పాటు చేశారు.
తాజాగా జరిగే ఈ విపక్షాల కీలక సమావేశానికి దేశంలోని ప్రధానమైన 24 పార్టీలను రావాలంటూ ఆహ్వానం పలికింది కాంగ్రెస్(Congress) పార్టీ. బెంగళూరు వేదికగా జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు హాజరవుతారు, ఇంకెవరు గైర్హాజరవుతారనే దానిపై ఆరా తీస్తోంది బీజేపీ. పంజాబ్, ఢిల్లీలో కొలువు తీరిన ఆప్ ఈ మీటింగ్ కు హాజరు కావడం లేదని సమాచారం.
Also Read : Pavitrotsavams Concludes : ముగిసిన పవిత్రోత్సవాలు
